Jasprit Bumrah: ఆర్సీబీతో ముంబయి ఇండియన్స్ ఢీ... ఈ మ్యాచ్ తో బుమ్రా రీఎంట్రీ

- ముంబయి వాంఖెడే స్టేడియంలో మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి జట్టు
- గాయం నుంచి కోలుకుని పునరామనం చేస్తున్న బుమ్రా
- ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ గా రోహిత్ శర్మ
ఐపీఎల్ లో ఇవాళ ముంబయి ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఢీకొంటున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన ముంబయి జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సొంతగడ్డపై ఛేజింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
కాగా, ఈ మ్యాచ్ లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆడుతుండడంతో ముంబయి ఇండియన్స్ జట్టులో కొత్త ఉత్సాహం నెలకొంది. మరోవైపు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ లో ఆడుతున్నాడు. అయితే అతడు ఇంపాక్ట్ సబ్ స్టిట్యూట్ గా బరిలో దిగనున్నాడు.
అటు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో ఎలాంటి మార్పులు లేవని ఆ జట్టు కెప్టెన్ రజత్ పటిదార్ వెల్లడించారు. బెంగళూరు జట్టు ఈ సీజన్ లో ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు నమోదు చేయగా... ముంబయి జట్టు 4 మ్యాచ్ లు ఆడి 1 మ్యాచ్ లో నెగ్గింది.