TSRTC Employees Strike: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్... మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి విధుల బహిష్కరణ

TSRTC Employees Strike to Begin May 6th Midnight

  • సమ్మెకు వెళ్లాలని నిర్ణయించిన జాయింట్ యాక్షన్ కమిటీ
  • ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు జేఏసీ నేతల సమ్మె నోటీసు
  • మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభం కానుంది. ఈ మేరకు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నిర్ణయం తీసుకుంది. టీజీఎస్ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్, కార్మిక శాఖ కమిషనర్‌కు జేఏసీ నేతలు సమ్మె నోటీసు అందజేశారు.

మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు వారు ఆ నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

TSRTC Employees Strike
TSRTC JAC
Sajjanar
Telangana RTC Strike
May 6th RTC Strike
RTC Employees Protest
Congress Manifesto Promises
Pending Salaries
Labor Commissioner
  • Loading...

More Telugu News