అవును, నేను కేసీఆర్‌కు విశ్వాసమైన కుక్కలా ఉంటాను: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
- కడియం శ్రీహరిలా తాను గుంట నక్కను మాత్రం కాదన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి
- బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన గుంట నక్క అని కడియంపై విమర్శ
- తనను గెలిపించిన వారిని కాపాడుకోవడానికి కాపలా కుక్కలా పని చేస్తానని వెల్లడి
తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకోవడానికి కాపలా కుక్కలా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రజల భూములను కాపాడటంలో రేచు కుక్కలా ఉండి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.