Prashanth Nayar: భార్య వేధింపులు తట్టుకోలేక టెక్కీ ఆత్మహత్య

Bengaluru Techies Suicide Wife Harassment Alleged

  • బెంగళూరులో ఘటన
  • కాపురంలో కలతలు
  • ఫ్యాన్ కు వేళ్లాడుతూ కనిపించిన టెక్కీ ప్రశాంత్ నాయర్

భార్య వేధింపులు తట్టుకోలేక బెంగళూరులో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని తన నివాసంలో 40 ఏళ్ల టెక్ ప్రొఫెషనల్ ప్రశాంత్ నాయర్ ఆదివారం నాడు బలవన్మరణం చెందాడు. వైవాహిక కలహాలే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రశాంత్ నాయర్ లెనోవో సంస్థలో సీనియర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా  పనిచేస్తున్నాడు. ఆయన భార్య పూజా నాయర్ డెల్ సంస్థలో 12 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తోంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె ఉంది. బెంగళూరులోని చిక్కబనవర ప్రాంతంలో వీరు నివాసం ఉంటున్నట్లు సమాచారం.

పోలీసుల కథనం ప్రకారం, ప్రశాంత్ నాయర్, పూజా నాయర్ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని, ఈ కారణంగా విడాకులు తీసుకోవాలని కూడా అనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రశాంత్ నాయర్‌ను భార్య పూజా మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆదివారం నాడు ప్రశాంత్ నాయర్ కు తండ్రి పదేపదే ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఫ్లాట్‌కు వెళ్లి చూడగా, అతను ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సంఘటన స్థలంలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. ఈ ఘటనపై సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేధింపుల ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ సంవత్సరం జనవరిలో యూపీకి చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు బెంగళూరులో సంచలనం సృష్టించడం తెలిసిందే. అతుల్ తన ఆత్మహత్యకు ముందు 24 పేజీల సూసైడ్ లేఖ, గంటన్నర వీడియోలో తన భార్య, ఆమె తల్లి తనను ఎలా వేధిస్తున్నారో వివరించాడు. తనపై అక్రమంగా గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టారని ఆరోపించాడు.

Prashanth Nayar
Bengaluru Techie Suicide
Wife Harassment
Marital Disputes
Domestic Violence
Pooja Nayar
Lenovo
Dell
Suicide
India
  • Loading...

More Telugu News