Mamata Banerjee: సుప్రీంకోర్టు తీర్పును నేను అంగీకరించను: మమతా బెనర్జీ

- బెంగాల్ లో 25 వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేసిన సుప్రీం
- తనను జైల్లో పెట్టినా సుప్రీం తీర్పును అంగీకరించబోనన్న మమత
- కోర్టు ధిక్కరణ కింద తనను జైల్లో పెట్టొచ్చని వ్యాఖ్య
పశ్చిమ బెంగాల్ లో 25 వేల ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. కొత్త నియామకాలను చేపట్టాలని బెంగాల్ ప్రభుత్వానికి సూచనలు చేసింది. సుప్రీం తీర్పుపై ఉపాధ్యాయులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు తీర్పును తాను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోనని అన్నారు. తనను జైల్లో పెట్టినా సరే... సుప్రీం తీర్పును అంగీకరించనని చెప్పారు. ఇలా మాట్లాడుతున్నందుకు కోర్టు ధిక్కరణ కింద తనను జైల్లో పెట్టొచ్చని అన్నారు. తాను బతికున్నంత కాలం ఎవరూ ఉద్యోగం కోల్పోరని చెప్పారు. అందరి ఉద్యోగాలను కాపాడే బాధ్యత తనదని అన్నారు. తనను సవాల్ చేసే వాళ్లకు సమాధానం ఎలా చెప్పాలో తనకు తెలుసని చెప్పారు.