LPG Price Hike: సామాన్యులకు షాక్... భారీగా గ్యాస్ ధరల పెంపు!

- వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచిన కేంద్రం
- ఈ మేరకు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటన
- ఉజ్వల పథక లబ్ధిదారులు, జనరల్ కేటగిరీ వినియోగదారులు ఇద్దరికీ ఈ ధరలు వర్తింపు
- రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి
వంట గ్యాస్ ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం వెల్లడించారు. జనరల్ కేటగిరీ వినియోగదారులతో పాటు ఉజ్వల పథక లబ్ధిదారులకు కూడా ఈ పెంపు వర్తిస్తుందన్నారు. రేపటి నుంచే కొత్త ధరలు అమల్లోకి వస్తాయని మంత్రి తెలిపారు.
ఈ పెంపుతో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర సాధారణ వినియోగదారులకు రూ. 803 నుంచి రూ. 853కు, ఉజ్వల్ సిలిండర్ రూ. 503 నుంచి రూ. 553కు చేరనుంది. అటు... పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని పెంచగా, ఆ భారాన్ని చమురు కంపెనీలే భరించనున్నాయి.