Donald Trump: ట్రంప్ ప్రకంపనలు... సెన్సెక్స్ 2,226 పాయింట్లు పతనం

- ప్రపంచాన్ని వణికిస్తున్న ట్రంప్ టారిఫ్ లు
- భారీగా పతనమవుతున్న ప్రపంచ మార్కెట్లు
- 742 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ప్రపంచ దేశాలపై ఆయన విధించిన టారిఫ్ లు గ్లోబల్ మార్కెట్లను వణికిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలతో ఆర్థికమాంద్యం భయాందోళనలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊహించనంతగా కుప్పకూలాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,226 పాయింట్ల నష్టంతో 73,137కి దిగజారింది. నిఫ్టీ 742 పాయింట్లు కోల్పోయి 22,161కి పతనమయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం హిందుస్థాన్ యూనిలీవర్ మాత్రమే (0.25%) లాభపడింది. టాటా స్టీల్ (-7.73%), ఎల్ అండ్ టీ (-5.78%), టాటా మోటార్స్ (-5.54%), కోటక్ బ్యాంక్ (-4.33%), మహీంద్రా అండ్ మహీంద్రా (-4.11%) భారీగా నష్టపోయాయి.