Jagan Mohan Reddy: రేపు పరిటాల సునీత నియోజకవర్గానికి వెళుతున్న జగన్

Jagan to Visit Paritala Sunithas Constituency Tomorrow

  • ఇటీవల దారుణ హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య
  • లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్
  • అనంతరం బెంగళూరుకు తిరుగు పయనం

వైసీపీ అధినేత జగన్ మాజీ మంత్రి పరిటాల సునీత నియోజకవర్గానికి వెళుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. 

రేపు ఉదయం 10.40 గంటలకు చెన్నేకొత్తపల్లికి చేరుకుని అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లికి వెళతారు. లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన తిరిగి చెన్నేకొత్తపల్లికి చేరుకుని... అక్కడి నుంచి హెలికాప్టర్ లో బెంగళూరుకు బయల్దేరుతారు. ఇటీవల లింగమయ్య హత్యకు గురయ్యారు. టీడీపీ నేతలే ఆయనను దారణంగా హత్య చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. 

Jagan Mohan Reddy
Paritala Sunitha
Raptadu
Anantapur
YSRCP
TDP
Lingamya murder
Andhra Pradesh Politics
Political Visit
Kondapalli
  • Loading...

More Telugu News