Mithun Reddy: మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట

Supreme Court Grants Relief to Mithun Reddy in AP Liquor Scam

  • లిక్కర్ స్కాం వ్యవహారంలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన మిథున్ రెడ్డి
  • మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశం
  • తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న ధర్మాసనం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఏపీ లిక్కర్ స్కాం వ్యవహారంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఏపీ సీఐడీని ధర్మాసనం ఆదేశించింది. తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ ప్రభుత్వ హాయాంలో మద్యం అమ్మకాలలో అక్రమాలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డిని మాత్రం ఇంకా నిందితుడిగా చేర్చలేదు. అయితే, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే భావనలో ఉన్న మిథున్ రెడ్డి ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. అయితే, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే బెయిల్ ఎలా ఇవ్వగలమని హైకోర్టు తెలిపింది. మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో, మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను ఈరోజు విచారించిన సుప్రీంకోర్టు... తాము ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది.

Mithun Reddy
YSRCP MP
AP Liquor Scam
Supreme Court
AP CID
Arrest
Bail
High Court
Andhra Pradesh Politics
Liquor Scam Investigation
  • Loading...

More Telugu News