Good Bad Ugly: 'గుడ్ బ్యాడ్ అగ్లీ' తెలుగు ట్రైలర్ వచ్చేసింది..!

- అజిత్ కుమార్, అధిక్ రవిచంద్రన్ కాంబోలో 'గుడ్ బ్యాడ్ అగ్లీ'
- ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
- కథానాయికగా త్రిష.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. మాస్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రంలో అజిత్ సరసన కథానాయికగా త్రిష నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో అర్జున్ దాస్, సునీల్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.