Ananya Nagalla: బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న తెలుగు భామ!

elugu Actress Ananya Nagalla Enters Bollywood

  • టాలీవుడ్ లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ రాణిస్తున్న అనన్య 
  • వకీల్ సాబ్ మూవీతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అందుకున్న వైనం
  • ఓ హిందీ ప్రాజెక్టులో లీడ్ రోల్‌కు అనన్య ఎంపికైనట్లు టాక్

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించే పరిస్థితులు అంతగా లేని ఈ రోజుల్లో, అచ్చమైన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మాత్రం తన సత్తా చాటుతున్నారు. టాలీవుడ్‌లో మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ల జాబితాలో ఆమె స్థానం సంపాదించారు.

మల్లేశం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనన్య, పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్‌ మూవీలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమాలో నటించిన తర్వాత మంచి గుర్తింపు అందుకున్న ఆమె, తంత్ర, పొట్టేల్, బహిష్కరణ (వెబ్ సిరీస్), శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ వంటి మూవీల్లో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నారు.

రూ.5 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందించే లేడీ ఓరియెంటెడ్ మూవీ నిర్మాతలకు అనన్య బెస్ట్ ఆప్షన్ అయిపోయారు. ఇదిలా ఉంటే, ఈ తెలుగమ్మాయి అనన్య ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ హిందీ ప్రాజెక్టులో, అది కూడా లీడ్ పాత్రలో అనన్య ఎంపికైనట్లు తెలుస్తోంది. 

Ananya Nagalla
Tollywood actress
Bollywood debut
Telugu actress
Ananya Nagalla movies
Vakeel Saab
Mallesham
South Indian actress
Telugu cinema
Bollywood project
  • Loading...

More Telugu News