MS Dhoni: వాళ్లతో కలిసి మళ్లీ ఆడాలని ఉంది: ధోనీ

- చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ
- టీమిండియాలోని నలుగురు స్టార్ క్రికెటర్లతో మళ్లీ ఆడాలన్న కోరిన ఉందన్న థోనీ
- సీజన్ పూర్తయ్యే వరకూ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని వెల్లడి
భారత జట్టులోని నలుగురు స్టార్ క్రికెటర్లతో మళ్లీ ఆడాలనే కోరిక ఉందని భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. ధోనీ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ధోనీ పాల్గొనగా, ఆ సందర్భంలో ఎదురైన ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
మళ్లీ అవకాశం వస్తే గతంలో టీమిండియాలో అదరగొట్టిన వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, యువరాజ్ సింగ్‌లతో కలిసి ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన పంచుకున్నారు.
2007 టీ20 వరల్డ్ కప్ సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ధోనీ గుర్తు చేసుకున్నారు. నాడు యువరాజ్ సింగ్ బాదిన సిక్సర్లను గుర్తు చేస్తూ అందరు ఆటగాళ్లు తమ జీవితాల్లో మ్యాచ్ విన్నర్లేనని వ్యాఖ్యానించాడు.
అలానే తన రిటైర్మెంట్ వార్తలను ధోనీ ఖండించారు. సీజన్ పూర్తయ్యే వరకూ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని పేర్కొన్నారు.