Bahamas Travel Warning: ఆ దేశం వెరీ డేంజర్... అక్కడికి వెళ్లొద్దంటూ తమ పౌరులకు అమెరికా హెచ్చరిక

US Issues Bahamas Travel Warning Crime Shark Attacks Prompt Urgent Advice

  • అట్లాంటిక్ మహాసముద్రంలో చిన్న దీవుల సమాహారమే బహమాస్
  • అక్కడ లైంగిక వేధింపులు, హత్యలు పెరిగిపోయాయన్న అమెరికా
  • తమ పౌరులకు తాజా మార్గదర్శకాలు జారీ చేసిన ట్రంప్ సర్కారు

అట్లాంటిక్ మహా సముద్రంలోని కొన్ని చిన్న దీవుల సమాహారమే బహమాస్. ఇది కామన్వెల్త్ దేశం. టూరిజం ప్రధాన ఆదాయ వనరు. ఇక్కడి బీచ్ లు, కోరల్ రీఫ్ లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. అయితే, బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు నేరాలు, సొర చేపల దాడుల గురించి ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితి అనుకూలంగా లేకపోతే ప్రయాణాన్ని మానుకోవాలని సూచించింది.

బహమాస్‌లో లైంగిక వేధింపులు, హత్యలు పెరిగిపోతున్నాయని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా న్యూ ప్రావిడెన్స్, గ్రాండ్ బహామా దీవులలోని నసావు, ఫ్రీపోర్ట్ ప్రాంతాలలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది. ఈ ప్రాంతాల్లోని హోటళ్లు కూడా సురక్షితం కాదని, వ్యక్తిగత భద్రత లేని ప్రదేశాల్లో ఉండకూడదని సూచించింది. సముద్రంలో సొరచేపల దాడులు కూడా ఎక్కువయ్యాయని, ఈతకు, బోటింగ్‌కు వెళ్లేవారు జాగ్రత్త వహించాలని హెచ్చరించింది.

అయితే, బహమాస్‌కు వెళ్లేటప్పుడు ఎటువంటి ఆయుధాలు తీసుకువెళ్లరాదని, అలా చేస్తే చట్టపరంగా నేరమని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే విమానాశ్రయంలో కఠిన చర్యలు తీసుకుంటారని, అరెస్టు చేసి జైలు శిక్ష, జరిమానా విధిస్తారని తెలిపింది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

Bahamas Travel Warning
US Bahamas Warning
Bahamas Crime
Bahamas Safety
Nassau Crime
Freeport Crime
Shark Attacks Bahamas
Bahamas Tourism
Travel Advisory Bahamas
  • Loading...

More Telugu News