Chandrababu Naidu: ట్రంప్ టారిఫ్ వార్... కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు

Chandrababu Naidus Letter to Piyush Goyal Amidst Trumps Tariff War
  • వివిధ దేశాలపై సుంకాలు పెంచిన ట్రంప్
  • భారత్ పై 27 శాతం టారిఫ్ పెంపు
  • దేశీయ ఆక్వారంగం కుదేలవుతోందని చంద్రబాబు ఆందోళన
  • తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కేంద్రమంత్రి పియూష్ గోయల్ కు లేఖ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్ టారిఫ్ యుద్ధానికి తెరలేపడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు మొదలయ్యాయి. ఎక్కడో ఉన్న ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇక్కడ ఏపీలోని ఆక్వారంగం కూడా ప్రభావితమవుతోంది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన నేడు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు.

భారత్‌పై అమెరికా 27 శాతం సుంకం విధింపు కారణంగా దేశీయ ఆక్వా రైతులు నష్టపోతున్నారని తన లేఖలో పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం విధిస్తున్న అధిక సుంకాలను తగ్గించాలని, తద్వారా ఆక్వా ఉత్పత్తులకు మినహాయింపు కల్పించాలని ఆయన ఆ లేఖలో కోరారు. 

అధిక టారిఫ్ ల వల్ల మన ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ చేయడానికి కూడా స్థలం లేదని ఆయన తెలిపారు. రాష్ట్ర జీడీపీలో మత్స్యరంగం ఒక ముఖ్యమైన భాగమని గుర్తు చేస్తూ, ఈ సంక్షోభ సమయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. 

ఆక్వా రైతులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చిన చంద్రబాబు, ఈ సమస్యను పరిష్కరించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
Chandrababu Naidu
Trump Tariff
US-India Trade War
Aquaculture
Andhra Pradesh
Piyush Goyal
Indian Farmers
Trade Disputes
Cold Storage

More Telugu News