Vijay Deverakonda: బీచ్ లో గుర్రంపై విజయ్ దేవరకొండ... చిల్లింగ్ ఫొటోలు వైరల్

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ షూటింగ్ లేకపోతే ఫారెన్ డెస్టినేషన్లకు చెక్కేస్తాడని తెలిసిందే. ప్రస్తుతం, విజయ్ దేవరకొండ వీడీ12 (వర్కింగ్ టైటిల్) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఇందులో భాగ్య శ్రీ భోర్సే కథానాయిక.
ఈ సినిమా షూటింగ్ కు గ్యాప్ రావడంతో విజయ్ దేవరకొండ వెకేషన్ కు వెళ్లాడు. పైగా సమ్మర్ కావడంతో ఓ బీచ్ ఏరియాలో సేదదీరుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశాడు.
కాటన్ బ్యాగీ దుస్తుల్లో ఆరామ్ గా కనిపిస్తున్న ఈ యంగ్ హీరో... గుర్రంపై షికారు చేస్తూ చిల్ అవుతుండడాన్ని ఫొటోల్లో చూడొచ్చు. ఈ ఫొటోలకు అభిమానుల నుంచి విశేషమైన స్పందన వస్తోంది.


