శ్రీలీల చేయి పట్టుకుని గుంపులోకి లాగిన పోకిరీలు... వీడియో ఇదిగో!

  • డార్జిలింగ్‌లో శ్రీలీలకు చేదు అనుభవం
  • ఆకతాయిల చర్యతో షాక్ తిన్న నటి
  • సిబ్బంది సహాయంతో సురక్షితంగా బయటపడిన వైనం
సెలబ్రిటీలు సైతం కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహానికి గురవుతున్న సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా, యువ హీరోయిన్ శ్రీలీలకు డార్జిలింగ్‌లో చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా కొందరు అభిమానులు ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

బాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీల, కార్తీక్ ఆర్యన్‌తో కలిసి అనురాగ్ బసు దర్శకత్వంలో ఒక ప్రేమ కథా చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ డార్జిలింగ్‌కు వెళ్ళింది. షూటింగ్ అనంతరం కార్తీక్ ఆర్యన్‌తో కలిసి శ్రీలీల తిరిగి వస్తుండగా అభిమానులు వారిని చుట్టుముట్టారు. 

కార్తీక్ ఆర్యన్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లగా, శ్రీలీల కూడా నవ్వుతూ ఆయనను అనుసరించారు. అయితే, గుంపులో ఉన్న కొందరు వ్యక్తులు శ్రీలీల చేయి పట్టుకుని లాగడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆమెను వారి నుంచి విడిపించి సురక్షితంగా అక్కడి నుంచి తీసుకువెళ్లారు. 

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు శ్రీలీల పట్ల జరిగిన ఈ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నారు. సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని, అభిమానులు హద్దులు మీరకుండా ప్రవర్తించాలని సూచిస్తున్నారు. అలాంటి ఆకతాయిలను దూరంగా ఉంచాలని స్పష్టం చేస్తున్నారు. 


More Telugu News