Narendra Modi: పాంబన్‌ వంతెనను ప్రారంభించిన మోదీ.. వీడియో ఇదిగో!

Modi Inaugurates Pamban Bridge
షార్ట్స్‌లో చూడండి
దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ‘పాంబన్ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. భారత భూభాగాన్ని రామేశ్వరంతో కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను మోదీ జాతికి అంకితం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, రూ. 535 కోట్లు వెచ్చించి తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ వంతెనను నిర్మించారు. 

2020లో రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌వీఎన్‌ఎల్‌) పనులు చేపట్టి, నాలుగేళ్లలో పూర్తిచేసింది. సముద్రంలో 2.08 కి.మీ. పొడవున్న ఈ వంతెనపై రైళ్ల రాకపోకలు సాగించేలా, కింది నుంచి ఓడలు వెళ్లేందుకు వీలుగా వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. 2019 మార్చి 1న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ... ఆదివారం ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. మోదీ పచ్చజెండా ఊపగానే ఈ బ్రిడ్జి పైనుంచి రామేశ్వరం-తాంబరం స్పెషల్ ట్రైన్ పరుగులు తీసింది.
Go Back to Shorts
Narendra Modi
Pamban Bridge
Vertical Lift Railway Bridge
India
Tamil Nadu
Rameswaram
Railway Bridge
Infrastructure
Modi Inaugurates Pamban Bridge

More Telugu News