Vijayalakshmi: హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఆదాయపు పన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ జయలక్ష్మి

- సికింద్రాబాద్ సీజీవో టవర్స్ ఎనిమిదో అంతస్తు నుంచి దూకి బలవన్మరణం
- పోలీసులకు సమాచారం అందించిన సెక్యూరిటీ సిబ్బంది
- క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించిన పోలీసులు
హైదరాబాద్ నగరంలో ఆదాయపు పన్ను శాఖలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సికింద్రాబాద్‌లోని సీజీవో టవర్స్ ఎనిమిదవ అంతస్తు నుంచి కిందకు దూకి ఆమె బలవన్మరణం చెందారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది గాంధీ నగర్ పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమికంగా అనారోగ్య కారణాల వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.