Amit Shah: ఆయుధాలు వీడండి: మావోయిస్టులకు అమిత్ షా పిలుపు

Amit Shahs Appeal to Maoists Lay Down Arms

  • బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోలు ఆపలేరన్న అమిత్ షా
  • 2026 మార్చి నాటికి నక్సల్స్ సమస్య అంతమవుతుందన్న అమిత్ షా
  • ఆయుధాలు పట్టుకొని గిరిజనుల అభివృద్ధిని ఆపలేరన్న కేంద్ర మంత్రి

మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఆయన ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బస్తర్ గిరిజనుల అభివృద్ధిని మావోయిస్టులు ఆపలేరని అన్నారు. 2026 మార్చి నాటికి నక్సల్ సమస్య అంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

బస్తర్‌లో బుల్లెట్ కాల్పులు, బాంబు పేలుళ్ల రోజులు ముగిశాయని ఆయన అన్నారు. ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులు మనలో భాగమేనని, ఏ మావోయిస్టు చనిపోయినా ఎవరిలోనూ సంతోషం ఉండదని అన్నారు. ఆయుధాలను చేతబూని స్థానికుల, గిరిజనుల అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు.

Amit Shah
Maoists
Naxalites
Chhattisgarh
Dantewada
Bastar
India
Surrender
Peace
Development
  • Loading...

More Telugu News