Telangana Rain Forecast: తెలంగాణకు వర్ష సూచన... పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

- ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న వర్షాలు
- ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం
- ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరిక
ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
ఈ నెల 7న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఈ నెల 8న ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సిద్ధిపేట, జనగామ, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూర్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
గత 24 గంటల్లో నారాయణపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం తెలిపింది.