Jagan Mohan Reddy: జగన్-షర్మిల మధ్య కుదిరిన ఒప్పందం క్లియర్ గా ఉంది: వేంపల్లి సతీశ్ రెడ్డి

- జగన్ పై షర్మిల అనవసర ఆరోపణలు చేస్తున్నారన్న వేంపల్లి
- షర్మిల చెబుతున్న ఆస్తులు దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఉన్నాయని వ్యాఖ్య
- డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా షర్మిలను చంద్రబాబు తెరపైకి తెచ్చారని విమర్శ
ఆస్తుల పంపకానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల అనవసర ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీశ్ రెడ్డి విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఆమెను సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. షర్మిల చెబుతున్న ఆస్తులు దర్యాప్తు సంస్థల ఆధీనంలో ఉన్నాయని చెప్పారు.
ఆ ఆస్తుల ఆస్తులు ఇవ్వలేదని షర్మిల అంటున్నారని సతీశ్ రెడ్డి విమర్శించారు. జగన్, షర్మిల మధ్య కుదిరిన ఒప్పందం క్లియర్ గా ఉందని చెప్పారు. టీడీపీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోందని... ప్రజలను దాన్నుంచి డైవర్ట్ చేయడానికి షర్మిలను చంద్రబాబు తెరపైకి తెచ్చారని విమర్శించారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే షర్మిల... జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.