Kalvakuntla Kavitha: ఇది కాలం తెచ్చిన కరవు కాదు: కవిత

Kavitha Blames Congress for Telangana Farmers Distress

  • యాదాద్రి జిల్లాలో ఎండిన పంట పొలాలను పరిశీలించిన కవిత
  • చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయాయని ఆవేదన
  • కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిక

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రైతులను వేధిస్తున్న అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎండిన పంట పొలాలను కవిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

తన పర్యటనపై ఎక్స్ వేదికగా కవిత స్పందిస్తూ... ఇది కాలం తెచ్చిన కరవు కాదని... కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరవు అని మండిపడ్డారు. వలిగొండ మండలం టేకులసోమారంలో సాగునీరు అందక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

దుఃఖంలో ఉన్న రైతులను చూస్తే గుండె తరుక్కుపోయిందని అన్నారు. నీటి నిర్వహణపై అవగాహన లేక పంట పొలాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెట్టిందని విమర్శించారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. 

Kalvakuntla Kavitha
BRS
Congress Government
Telangana Farmers
Crop Failure
Yadadri Bhuvanagiri
Water Management
Farmer's Distress
Agricultural Crisis
Andhra Pradesh Politics
  • Loading...

More Telugu News