Ram Charan: 'పెద్ది గ్లింప్స్' మామూలుగా లేదు... ఏఆర్ రెహమాన్ సర్ అదరగొట్టేశారు: రామ్ చరణ్

Ram Charan Teases Peddi Glimpse with AR Rahmans Music

  • రామ్ చరణ్ హీరోగా పెద్ది
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో భారీ చిత్రం
  • గ్లింప్స్ వీడియో చూశాక రామ్ చరణ్ స్పందన ఇదే!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం పెద్ది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ షాట్ పేరిట రేపు ఓ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ఆ గ్లింప్స్ వీడియోను తాను చూశానని తాజాగా హీరో రామ్ చరణ్ వెల్లడించారు. ఈ మేరకు ఓ శాంపిల్ మ్యూజిక్ బిట్ ను పంచుకున్నారు. 'పెద్ది పెద్ది' అంటూ సాగే ఈ బిట్ కిర్రాక్ పుట్టించేలా ఉంది. దీనిపై రామ్ చరణ్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

"పెద్ది గ్లింప్స్ చూశాక అమితమైన సంతోషం కలిగింది. ఏఆర్ రెహమాన్ సర్ ఈ సినిమాకు అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి... మామూలుగా లేదు... అదరహో అనేలా ఉంది. ఈ గ్లింప్స్ ను మీరు (అభిమానులు) తప్పకుండా ఇష్టపడతారు. రేపు (ఏప్రిల్ 6) ఉదయం 11.45 గంటలకు ఫస్ట్ షాట్ (గ్లింప్స్) వస్తోంది" అంటూ రామ్ చరణ్ పోస్ట్ చేశారు.

Ram Charan
Peddi Movie
A.R. Rahman
Telugu Cinema
Tollywood
Film Glimpse
First Glimpse
Sana Buchibabu
Movie Update
South Indian Cinema
  • Loading...

More Telugu News