లక్నోపై టాస్ గెలిచిన ముంబయి... గాయం కారణంగా మ్యాచ్‌కు రోహిత్ దూరం!
- లక్నో వేదికగా ఎంఐ, ఎల్ఎస్‌జీ మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి
- ప్రాక్టీస్‌లో గాయపడి మ్యాచ్‌కు దూరమైన హిట్‌మ్యాన్
ఇక ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో ఇరు జట్లు కేవలం ఒక్కో మ్యాచ్ మాత్రమే గెలిచాయి. పాయింట్ల పట్టికలో ముంబయి ఆరో స్థానంలో ఉంటే... లక్నో ఏడో స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి వెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), బదోని, మిల్లర్, సమద్, శార్ధూల్ ఠాకూర్, దిగ్వేశ్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్
ఇంపాక్ట్ సబ్స్: రవి బిష్ణోయ్, ప్రిన్స్, షాబాజ్, సిద్దార్థ్, ఆకాశ్
ముంబై ఇండియన్స్ జట్టు: జాక్స్, రికెల్టన్ (వికెట్ కీపర్), ధీర్, సూర్యకుమార్, హార్దిక్ (కెప్టెన్), బవా, సాంట్నర్, చాహర్, బౌల్ట్, అశ్వని, పుత్తూరు
ఇంపాక్ట్ సబ్స్: తిలక్ వర్మ, బాష్, మింజ్, సత్యనారాయణ రాజు, కర్న్