Congress: వక్ఫ్ సవరణ బిల్లు-2025పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్, మజ్లిస్

Congress Majlis challenge Wakf Amendment Bill in Supreme Court

  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్
  • ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందన్న ఎంపీలు
  • ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పేర్కొన్న ఎంపీలు

వక్ఫ్ (సవరణ) బిల్లు-2025ను సవాల్ చేస్తూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పార్లమెంటు ఉభయ సభల్లో వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 ఆమోదం పొందిన విషయం విదితమే.

ఈ బిల్లును కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బిల్లు (సవరణ) లోని నిబంధనలు ముస్లిం సమాజం యొక్క ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లు వక్ఫ్ ఆస్తులు, వాటి నిర్వహణపై ఏకపక్షంగా ఉందని, ముస్లిం సమాజానికి చెందిన మతపరమైన స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పిటిషన్‌లో ఆరోపించారు.

ఇదిలా ఉండగా, వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌లలోని పలు ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు తెలిపారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు నిర్వహించారు.

Congress
Majlis
Asaduddin Owaisi
Mohammad Jaweed
Wakf Amendment Bill 2025
Supreme Court
Muslim community
Fundamental Rights
India
Religious Freedom
  • Loading...

More Telugu News