Mallaiah: రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది: బీసీ కార్పొరేషన్ ఎండీ

- అర్హులైన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్న మల్లయ్య బట్టు
- దరఖాస్తు ముద్రణ కాపీలను ఎంపీడీవో కార్యాలయాల్లో ఇవ్వాలని సూచన
- రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధ్రవీకరణ పత్రం జమ చేయాలని సూచన
రాజీవ్ యువ వికాసం పథకానికి రేషన్ కార్డు ఉంటే చాలని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకంపై ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఈనాడు-ఈటీవీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు కాపీలను ఎంపీడీవో కార్యాలయాల్లో సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. రేషన్ కార్డు ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
రేషన్ కార్డు లేనివారు ఆదాయ ధ్రవీకరణ పత్రాన్ని జత చేయాలని ఆయన సూచించారు. రాయితీ రుణాల పథకం మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించబడిందని ఆయన వివరించారు. రూ. 50 వేల పథకానికి ప్రభుత్వం 100 శాతం రాయితీని, రూ. 1 లక్ష పథకానికి 90 శాతం రాయితీని అందిస్తుందని ఆయన తెలియజేశారు.