TSPSC: టీజీపీఎస్‌సీ... గ్రూప్ 1 నియామకాల‌కు లైన్ క్లియ‌ర్

TSPSC Group 1 Recruitment Supreme Court Clears the Way

  • జీఓ 29 చెల్లుబాటుపై దాఖ‌లైన పిటిష‌న్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • జీఓ 29 చెల్లుబాటును స‌వాల్ చేస్తూ అత్యున్న‌త న్యాయ‌స్థానానికి గ్రూప్ 1 అభ్య‌ర్థులు 
  • తాజాగా విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం పిటిష‌న్‌ను కొట్టివేసిన వైనం

తెలంగాణ‌లో గ్రూప్ 1 నియామకాల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. తెలంగాణ స‌ర్కార్ జారీ చేసిన జీఓ 29 చెల్లుబాటుపై దాఖ‌లైన పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీఓ 29 చెల్లుబాటును స‌వాల్ చేస్తూ గ్రూప్ 1 అభ్య‌ర్థులు అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. దీనిపై తాజాగా విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం పిటిష‌న్‌ను కొట్టివేసింది.  

కాగా, దివ్యాంగుల రిజ‌ర్వేషన్ల‌కు సంబంధించి 2022లో జారీ చేసిన జీఓ 55 కు స‌వ‌ర‌ణ తీసుకొస్తూ ఫిబ్ర‌వ‌రి 28న తెలంగాణ స‌ర్కార్ జీఓ 29ను జారీ చేసింది. దీనిని ర‌ద్దు చేయాల‌ని కోరుతూ గ్రూప్ 1 అభ్య‌ర్థులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. 

తాజాగా పిటిష‌న్ కొట్టివేత‌తో గ్రూప్ 1 నియామకాల‌కు అడ్డంకి తొలగిపోయింది. ఇక ఇప్ప‌టికే టీజీపీఎస్‌సీ గ్రూప్ 1 జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ జాబితాను విడుద‌ల చేసింది. త్వ‌ర‌లో 1:2 నిష్ప‌త్తిలో స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్ ఉండ‌నుంది.  

TSPSC
Group 1 Recruitment
Telangana PSC
Supreme Court
GO 29
GO 55
Telangana Group 1
Government Jobs Telangana
TSPSC Group 1 Results
Certificate Verification
  • Loading...

More Telugu News