గ‌చ్చిబౌలి భూముల‌పై పోలీసుల కీల‌క ఆదేశాలు

  • గచ్చిబౌలి భూముల్లోకి బ‌య‌టి వ్య‌క్తుల నిషేధం
  • ఆంక్ష‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న పోలీసులు
  • ఈ వ్య‌వ‌హారంతో సంబంధం లేని వ్య‌క్తులు ఆ భూముల్లోకి వెళ్ల‌రాద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్య‌వ‌హారంతో సంబంధం లేని వ్య‌క్తులు ఆ భూముల్లోకి వెళ్ల‌రాద‌ని స్ప‌ష్టం చేశారు. ఆంక్ష‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు. 

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచ గ‌చ్చిబౌలి రెవెన్యూ స‌ర్వే నం.25లో గ‌ల 400 ఎకరాల భూమిపై ప్ర‌స్తుతం వివాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఈ భూముల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరుపై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. తుది ఆదేశాలు జారీ చేసే వరకు ఈ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఒక్క రోజులో వంద‌ ఎక‌రాల్లో చెట్లు న‌రికేయ‌డం ఏంట‌ని న్యాయ‌స్థానం మండిప‌డింది.


More Telugu News