కాంగ్రెస్ నేత‌కు గుండెపోటు.. సీపీఆర్ చేసి కాపాడిన ఎమ్మెల్యే

  • భ‌ద్రాచ‌లంలో గుండెపోటుతో ఆప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన కాంగ్రెస్ నేత‌
  • ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు సీపీఆర్ చేయ‌డంతో త‌ప్పిన‌ ప్రాణాపాయం 
  • మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భ‌ద్రాచ‌లానికి కాంగ్రెస్ నేత‌లు
భ‌ద్రాచ‌లంలో గుండెపోటుతో ఆప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిన కాంగ్రెస్ నేత‌ను స్థానిక ఎమ్మెల్యే, డాక్ట‌ర్‌ తెల్లం వెంక‌ట్రావు సీపీఆర్ చేసి ర‌క్షించారు. మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పార్టీకి చెందిన నేత‌లంతా భ‌ద్రాచ‌లానికి వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో ఒక కాంగ్రెస్ నేత ఒక్క‌సారిగా గుండెపోటుతో కుప్ప‌కూలాడు. దీంతో అక్క‌డే ఉన్న ఎమ్మెల్యే తెల్లం వెంక‌ట్రావు త‌క్ష‌ణ‌మే స్పందించి సీపీఆర్ చేయ‌డంతో ప్రాణాపాయం త‌ప్పింది. అనంత‌రం కాంగ్రెస్ నేత‌ను చికిత్స కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.  




More Telugu News