Donald Trump: ట్రంప్ ఎఫెక్ట్... భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు

Stock Market Plunges on Trumps Tariff Decision

  • 930 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 345 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 8 శాతానికి పైగా పతనమైన టాటా స్టీల్ షేరు విలువ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ల కారణంగా ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. మన మార్కెట్లే కాకుండా ఆసియాలోని అన్ని మార్కెట్లను ట్రంప్ నిర్ణయం కుదిపేసింది. మన మార్కెట్లలో ఐటీ, మెటల్, ఫార్మా సూచీల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 930 పాయింట్లు నష్టపోయి 75,364కి దిగజారింది. నిఫ్టీ 345 పాయింట్లు కోల్పోయి 22,904కి పడిపోయింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (1.43%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.30%), నెస్లే ఇండియా (0.79%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.38%), ఏషియన్ పెయింట్ (0.27%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-8.59%), టాటా మోటార్స్ (-6.15%), ఎల్ అండ్ టీ (-4.67%), అదానీ పోర్ట్స్ (-4.38%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.83%).

Donald Trump
Stock Market Crash
Tariff Impact
Sensex
Nifty
Indian Stock Market
Asia Stock Market
Market Volatility
Economic Impact
Trade War
  • Loading...

More Telugu News