Seetadayakar Reddy: తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతాదయాకర్ రెడ్డి నియామకం

- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- చైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యుల నియామకం
- సభ్యులలో గోగుల సరిత, వచన్ కుమార్ తదితరులు
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా సీతా దయాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
చైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. కంచర్ల వందన గౌడ్, బి. అపర్ణ, మర్రిపల్లి చందన, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి. వచన్ కుమార్ కమిషన్ సభ్యులుగా ఉంటారు.