Raja Singh: ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు... కిషన్ రెడ్డిపై రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం

Raja Singhs Anger Erupts Over Gautam Raos MLC Nomination

  • మీ పార్లమెంటు నియోజకవర్గానికే పోస్టులు ఇస్తారా అని ప్రశ్న
  • హైదరాబాద్‌లో ఇంకా అభ్యర్థులే లేరా అని నిలదీత
  • గులాంగిరి చేసే వారికి పోస్టులు, టిక్కెట్లు ఇవ్వడమేమిటని నిలదీత

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీజేపీ నేత, గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ పార్లమెంటు నియోజకవర్గానికే పదవులు ఇస్తారా అని కిషన్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇంకా బీజేపీ అభ్యర్థులే లేరా అని నిలదీశారు.

పార్టీ అధిష్ఠానానికి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. మీకు గులాంగిరి చేసేవారికే పదవులు, టిక్కెట్లు ఇవ్వడమేమిటని నిలదీశారు. మిగతా నేతలను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. కాగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును అధిష్ఠానం ప్రకటించింది. మే 1వ తేదీతో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు పదవీకాలం ముగియనుంది. దీంతో ఈ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.

Raja Singh
Kishan Reddy
BJP
MLC Elections
Gautam Rao
Hyderabad MLC
Telangana Politics
BJP Candidate
Goshamahal MLA
Party Nomination
  • Loading...

More Telugu News