Mallu Bhatti Vikramarka: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. ఉన్నతాధికారులతో భట్టివిక్రమార్క భేటీ

Bhatti Vikramarka Meets Officials Amidst Gachibowli Land Dispute

  • చెట్ల తొలగింపు పనులను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు
  • ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
  • భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులతో భట్టివిక్రమార్క చర్చ

కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చెట్ల తొలగింపు పనులను తక్షణమే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) ఎగ్జిక్యూటివ్ కమిటీ, విద్యార్థుల ప్రతినిధులు, జాయింట్ యాక్షన్ కమిటీ, సివిల్ సొసైటీ గ్రూపులు సహా భాగస్వాములైన ప్రతి ఒక్కరితోనూ చర్చిస్తుంది.

కమిటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మల్లు భట్టివిక్రమార్క ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

Mallu Bhatti Vikramarka
Gachibowli land issue
Telangana government
Supreme Court order
Revanth Reddy
Committee
HCU
Land dispute
  • Loading...

More Telugu News