Chandrababu: స‌చివాలయంలో అగ్ని ప్ర‌మాదం... ప్ర‌మాదస్థ‌లాన్ని ప‌రిశీలించిన సీఎం చంద్ర‌బాబు

AP Secretariat Fire CM Chandrababu Naidu Inspects Damage

  • సచివాలయంలోని రెండో బ్లాక్‌లో అగ్ని ప్ర‌మాదం
  • బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో చెల‌రేగిన మంట‌లు
  • ప్ర‌మాదంపై అధికారుల‌ను అడిగి తెలుసుకున్న సీఎం

ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉద‌యం అగ్నిప్రమాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క‌ సిబ్బంది వెంట‌నే ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. 

అయితే, ప్ర‌మాదం జ‌రిగిన ప్ర‌దేశాన్ని సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రిశీలించారు. అగ్ని ప్రమాదం ఎలా జ‌రిగింద‌నే విష‌యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను ముఖ్య‌మంత్రికి సీఎస్ విజ‌యానంద్‌, డీజీపీ హ‌రీశ్‌కుమార్ గుప్తా, జీఏడీ సెక్ర‌ట‌రీ ముఖేశ్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్ర‌తాప్ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌మాదం ద్వారా జ‌రిగిన ఆస్తి న‌ష్టంపై అధికారుల వ‌ద్ద‌ సీఎం ఆరా తీసిన‌ట్లు తెలుస్తోంది. 

కాగా, సచివాలయంలోని రెండో బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టూరిజం మంత్రి కందుల దుర్గేశ్‌, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేషీలు ఉన్న విష‌యం తెలిసిందే.   

Chandrababu
Andhra Pradesh Secretariat Fire
Vijayawada Fire Incident
AP Secretariat Fire
Chief Minister Andhra Pradesh
Fire Accident
Secretariat Block 2
Government Officials
Pawan Kalyan
  • Loading...

More Telugu News