KKR: ఐపీఎల్‌లో కేకేఆర్ అరుదైన ఘనత.. తొలి జట్టుగా నయా రికార్డ్!

- 3 జట్లపై 20 అంతకంటే ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా కేకేఆర్
- ఎస్ఆర్‌హెచ్‌పై 20, ఆర్‌సీబీపై 20, పంజాబ్ కింగ్స్ పై 21 విజయాలు
- అలాగే సన్‌రైజర్స్ పై 2023-25 మధ్య వరుసగా 5 మ్యాచుల్లో కోల్‌కతా విజయం
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అరుదైన ఘనత సాధించింది. గురువారం సన్‌రైజర్స్ తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో కోల్‌కతా జట్టు ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టోర్నీ చరిత్రలో మూడు జట్లపై 20 అంతకంటే ఎక్కువ విజయాలు సాధించిన టీమ్ గా సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇప్పటివరకూ ఎస్ఆర్‌హెచ్‌పై 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 20, పంజాబ్ కింగ్స్ పై 21 విజయాలు నమోదు చేసింది. అలాగే సన్‌రైజర్స్ పై 2023-25 మధ్య వరుసగా 5 మ్యాచుల్లో కోల్‌కతా విజయం సాధించడం గమనార్హం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కూడా 2020-23 మధ్య ఎస్ఆర్‌హెచ్ పై వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచింది. కాగా, ఐపీఎల్‌లో రన్స్ పరంగా నిన్నటి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ కు భారీ పరాజయం చవిచూసింది. ఈ మ్యాచ్ లో 80 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.