అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్
- ఏర్పాటుకు ముందుకొచ్చిన లారస్ ల్యాబ్స్ లిమిటెడ్
- గోరపూడి ఫేజ్-2 సెజ్ భూముల్లో యూనిట్
- ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉపాధి
లారస్ సంస్థ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు నిన్న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... ఈ యూనిట్ ద్వారా ఫర్మెంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి ప్రత్యేక రసాయనాలను తయారు చేస్తుందని తెలిపారు. లారస్ సంస్థకు భూ కేటాయింపులతోపాటు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కోరారు.
