H1B Visa: హెచ్‌1బీ వీసాదారులకు టెక్‌ కంపెనీల వార్నింగ్.. భారత్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకుంటున్న వలసదారులు

Tech Companies Warn H1B Visa Holders Against India Trip

  • వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తున్న ట్రంప్‌ 
  • క‌ఠిన నిర్ణ‌యాల‌తో వ‌ల‌స‌దారుల‌పై ఉక్కుపాదం
  • హెచ్‌1బీ వీసాదారులు స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాలో కాలు పెట్టేది అనుమానం
  • ఈ నేపథ్యంలో అప్ర‌మ‌త్త‌మైన‌ గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌
  • తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్‌1బీ వీసాదారులకు హెచ్చ‌రిక‌లు

అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో  ఆయ‌న తీసుకుంటున్న ప‌లు నిర్ణయాలు వలసదారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెత్తిస్తున్నాయి. ప్ర‌ధానంగా హెచ్‌1బీ వీసాదారులు స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాలో కాలు పెట్టేది అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో ప్ర‌ముఖ టెక్ సంస్థ‌లు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ అప్రమత్తమయ్యాయి. తమ కంపెనీల్లో పనిచేస్తున్న హెచ్‌1బీ వీసాదారులను అప్రమత్తం చేస్తున్నాయి. అమెరికాను వీడొద్దని, వెళ్తే తిరిగి రావ‌డం అంత సులువు కాద‌ని హెచ్చ‌రిస్తున్నాయి. 

దీంతో భారత్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్టు పలువురు హెచ్‌1 బీ వీసాదారులు చెప్పినట్టు ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ కథనం పేర్కొంది. అమెరికా పౌరులు మినహా, మిగతా అందరూ అక్రమ వలసదారులే అన్న భావన ప్ర‌స్తుతం అక్కడ నెలకొని ఉందని భారతీయ వలసదారులు చెబుతున్నార‌ని వార్తా కథనం తెలిపింది. దీంతో తాము ఎక్కడికి వెళ్లినా అవసరమైన పత్రాలన్నీ త‌మ వెంట తీసుకెళ్తున్నామని చెప్పారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే భార‌త ఎంబ‌సీ అధికారులు కూడా ఎన్నారైల‌ను అప్ర‌మ‌త్తం చేశాయి. 

H1B Visa
Donald Trump
H1B Visa Holders
US Immigration Policy
Google
Microsoft
Amazon
Tech Companies
India Travel
Washington Post
  • Loading...

More Telugu News