Telangana: తెలంగాణలో మ‌రో రెండు రోజులు వడగండ్ల వానలు.. వివిధ జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అల‌ర్ట్‌!

Telangana Braces for Hailstorms Orange and Yellow Alerts Issued

  


తెలంగాణలో ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన వ‌ర్షం బీభత్సం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఉరుములు, మెరుపులతో కూడిన వాన‌ దంచి కొట్టింది. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఉమ్మడి మెదక్‌, నిజామాబాద్‌, యాదాద్రి భువనగిరి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. 

ఇక రాగల రెండు రోజుల్లో వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వివిధ జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 

గురువారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, సంగారెడ్డి, మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వడగండ్ల వాన‌ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. 

శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట, హన్మకొండ, భువనగిరి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మల్కాజ్ గిరి, జనగాం, వికారాబాద్‌ తదితర జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వ‌ర్షాలు పడుతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 


Telangana
hailstorm
rain
weather warning
orange alert
yellow alert
weather forecast
Telangana weather
heavy rainfall
thunderstorm
  • Loading...

More Telugu News