వేదికపై కిందపడ్డ ఆస్ట్రేలియా ప్రధాని... వీడియో చూడండి!

  • ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్
  • స్టేజ్ మీద అదుపుతప్పి కిందకు పడిపోయిన వైనం
  • నవ్వుతూ పైకి లేచిన ప్రధాని 
ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. స్టేజ్ మీద నడుస్తుండగా అదుపుతప్పి కిందకు పడిపోయారు. వెంటనే పక్కనున్నవారు ఆయనను పైకి లేపారు. అనంతరం ఆయన నవ్వుతూ క్షేమంగా ఉన్నానంటూ చేతులు ఊపారు. ప్రధానికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


More Telugu News