Gachibowli land dispute: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై విచారణ ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా

Gachibowli Land Dispute Hearing Adjourned to April 7

  • 400 ఎకరాల భూములపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం
  • కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కోరిన అడ్వొకేట్ జనరల్
  • మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ

హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. 400 ఎకరాల భూములపై ప్రభుత్వానికి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)కు మధ్య వివాదం నెలకొన్న విషయం విదితమే. ఈ భూములపై వట ఫౌండేషన్, హెచ్‌సీయూ విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌లపై నిన్న వాదనలు విన్న హైకోర్టు, ఒక్కరోజు పనులను నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై ఈరోజు మరోసారి విచారణ చేపట్టింది.

ఈ కేసుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు కావాలని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు కంచ గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని నిన్న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Gachibowli land dispute
Telangana High Court
HCU land issue
Vata Foundation
Government of Telangana
Hyderabad Central University
Public Interest Litigation
Land acquisition
April 7 hearing
Gachibowli
  • Loading...

More Telugu News