Ram Gopal Varma: ప్రభాస్ 'స్పిరిట్' సినిమాలో నటించబోతున్నారనే వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందన

- ప్రభాస్, సందీప్ వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న 'స్పిరిట్'
- ఈ సినిమాలో వర్మ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారంటూ వార్తలు
- ఈ ప్రచారంలో నిజం లేదన్న వర్మ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో 'స్పిరిట్' అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ మెక్సికోలో జరపనున్నట్టు సందీప్ వంగా వెల్లడించారు. మరోవైపు ఈ సినిమాలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ వార్తలపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వార్త తాను చాలా రోజుల నుంచి వింటున్నానని... కానీ, ఈ వార్తలో నిజం లేదని చెప్పారు. తనకు అశ్వనీదత్, ప్రభాస్ బాగా తెలుసని... 'కల్కి'లో చేయమని తనను వారు సరదాగా అడిగారని... దాంతో తాను చేశానని తెలిపారు. 'కల్కి' సినిమాలో తన పాత్రకు ప్రేక్షకుల నుంచి వచ్చిన రియాక్షన్ చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు.