Pradeep Machiraju: ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించిన ప్లాన్ ఏమీ లేదు: యాంకర్ ప్రదీప్

- జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నానన్న ప్రదీప్
- కొన్ని కలలు, లక్ష్యాలు ఉన్నాయని వెల్లడి
- అన్నీ సరైన సమయానికే పూర్తవుతాయని విశ్వసిస్తున్నానని స్పష్టీకరణ
బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు వివాహం గురించి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. ప్రస్తుతానికి పెళ్లికి సంబంధించిన ఆలోచనలేమీ లేవని, జీవితంలో స్థిరపడాలని అనుకుంటున్నానని తెలిపారు. తనకు కొన్ని కలలు, లక్ష్యాలు ఉన్నాయని వెల్లడించారు.
మొదట వాటిని సాధించాలని ఆయన పేర్కొన్నారు. తన కలలు, లక్ష్యాలు కాస్త ఆలస్యం కావడంతో మిగిలిన విషయాలకు కూడా కొంత సమయం పడుతుందని అన్నారు. అయితే, అన్నీ సరైన సమయానికే పూర్తవుతాయని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.
రాజకీయ నాయకురాలితో తనకు వివాహం జరగనుందని కొందరు ప్రచారం చేశారని అన్నారు. అంతకుముందు ఒక రియల్ ఎస్టేట్ కుటుంబానికి చెందిన అమ్మాయితో కూడా పెళ్లి జరుగుతుందని పుకార్లు వచ్చాయని, త్వరలో ఒక క్రికెటర్‌తో అంటారేమో అని నవ్వుతూ అన్నారు. అవన్నీ కేవలం వినోదాత్మక ప్రచారాలు మాత్రమేనని ప్రదీప్ స్పష్టం చేశారు.