Amit Shah: వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు స్థానం లేదు: అమిత్ షా స్పష్టీకరణ

Amit Shah Clarifies No Non Muslims in Waqf Boards
షార్ట్స్‌లో చూడండి
వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లుపై లోక్ సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకు కూడా స్థానం కల్పిస్తారంటూ కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లులో అలాంటి నిబంధన ఏదీ లేదని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలు మాత్రమే ఉంటారని, ముస్లిమేతరులు ఉండరని అమిత్ షా ఉద్ఘాటించారు. 

వక్ఫ్ బోర్డు ఏంచేయాలి... వక్ఫ్ సంపదను అమ్ముకుని తినేవారిని పట్టుకోవాలి... వక్ఫ్ పేరుతో ఆస్తులను వందల ఏళ్ల పాటు షాపులకు కిరాయికి ఇచ్చినవారిని పట్టుకోవాలి అని అన్నారు. వక్ఫ్ ఆదాయం తగ్గుతూ వస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డుల ద్వారా మైనారిటీలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని, ఇస్లాం ధార్మిక సంస్థలను బలోపేతం చేయాలని అన్నారు.
Go Back to Shorts
Amit Shah
Waqf Board
Muslim
India
Lok Sabha
Waqf Bill
Minority
Islamic Institutions
Waqf Property

More Telugu News