అప్పుడే పుట్టిన శిశువులు మారిపోతే... ఓటీటీకి 'బేబీ అండ్ బేబీ'

Baby and Baby Movie Update
  • తమిళంలో రూపొందిన 'బేబీ అండ్ బేబీ'
  • కామెడీ డ్రామా జోనర్లో నడిచే కథ 
  • థియేటర్ల వైపు నుంచి పెద్దగా రాని రెస్పాన్స్
  • ఈ నెల 4 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్  

తమిళంలో జై హీరోగా ఒక సినిమా రూపొందింది. కామెడీ డ్రామా జోనర్లో నిర్మితమైన ఆ సినిమా పేరే 'బేబీ అండ్ బేబీ'. ఫిబ్రవరి 14వ తేదీన విడుదలైన ఈ సినిమాకి, థియేటర్ల వైపు నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత 'సన్ నెక్ట్స్' ఓటీటీకి వెళ్లిన ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' తమిళ ఓటీటీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలుకానుంది. 

జై జోడీగా ఈ సినిమాలో ప్రజ్ఞా నగ్రా కనిపించనుంది. ఈ బ్యూటీ 'లగ్గం' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది. తమిళంలో ఆమె చేసిన మూడో సినిమా ఇది. యువరాజ్ నిర్మించిన ఈ సినిమాకి ప్రతాప్ దర్శకత్వం వహించాడు. సత్యరాజ్, యోగిబాబు, ఇళవరసు ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

ఈ కథ రెండు జంటల చుట్టూ తిరుగుతుంది. రెండు జంటలకు ఒకే సమయంలో బిడ్డలు కలుగుతారు. ఊహించని విధంగా శిశువులు తారుమారు అవుతారు. ఆ జంట బిడ్డ వీరి దగ్గరికీ... ఈ జంట బిడ్డ వారి చేతుల్లోకి వెళతారు. అప్పటి నుంచి ఆ రెండు జంటల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయి అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ కంటెంట్ ఎన్ని మార్కులు కొట్టేస్తుందో చూడాలి.

Go Back to Shorts
Jai
Baby and Baby
Prajna Nagra
Tamil Movie
Comedy Drama
Sathyaraj
Yogi Babu
Ilavarasu
Aha Tamil OTT
Baby Swap

More Telugu News