Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మధురవాడలో ప్రేమోన్మాది ఘాతుకం... హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి

Madhurawada Love Crime Woman Killed Daughter Injured
Advertisement
  • విశాఖ స్వయంకృషి నగర్ లో ఓ తల్లీకూతురుపై ప్రేమోన్మాది నవీన్ దాడి
  • తల్లి లక్ష్మి మృతి... కుమార్తె దీపిక పరిస్థితి విషమం
  • దీపికను ప్రేమ పేరుతో వేధిస్తున్న నవీన్
Advertisement
విశాఖపట్నం మధురవాడలో ఈ మధ్యాహ్నం ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇక్కడి స్వయంకృషి నగర్ లో ప్రేమోన్మాది ఓ తల్లీకూతురుపై కత్తి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడింది. మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నవీన్ అనే యువకుడు డిగ్రీ చదువుతున్న దీపిక అనే యువతి ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన దీపిక తల్లి లక్ష్మి (43)ని కూడా నవీన్ కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన దీపికను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. ప్రేమ పేరుతో నవీన్ గత కొంతకాలంగా దీపికను వేధిస్తున్నాడని సమాచారం. దాడి జరిగిన వెంటనే నవీన్ పరారయ్యాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

మధురవాడలో జరిగిన ఈ ప్రేమోన్మాది దాడి ఘటనపై హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యువతి తల్లి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలు దీపికకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రేమోన్మాదిని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
Advertisement
Advertisement
Naveen
Madhurawada
Visakhapatnam
Love Crime
Murder
Attack
Deepa
Lakshmi
Home Minister Anita
Andhra Pradesh

More Telugu News