ఈటీవీ విన్ తెరపైకి పసందైన కథలు!
- ఈటీవీ విన్ లో 'కథాసుధ'
- ప్రతి ఆదివారం చెప్పే కొత్తకథ
- ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యత
- మరింత ఆదరణ పెరిగే అవకాశం
ఈటీవీ విన్ లో ఈ నెల 6వ తేదీ నుంచి 'కథాసుధ' ప్రసారం కానుంది. ఈ 'కథాసుధ'లో ప్రతి ఆదివారం ఒక కొత్త కథ వచ్చి చేరనుంది. ఏ కథకు ఆ కథగా ఇది ప్రేక్షకులను పలకరిస్తుంది. గతంలో 'బాలచందర్ బుల్లితెర కథలు' ఈ తరహాలోనే ప్రసారమైనట్టుగా గుర్తు. గతంలో ఏ కథకు ఆ కథగా 'కథా సంపుటి'గా బుక్స్ వస్తుండేవి. అలాగే ఇప్పుడు వివిధ రకాల కథలను 'కథాసుధ' ద్వారా అందించనున్నారు.
నిజానికి వారానికి ఒక కథను అందించడం వలన .. ఆ కథల్లో ఫీల్ ను వర్కౌట్ చేసే సమయం దర్శకులకు దొరుకుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన మంచి కథల ఎంపిక జరుగుతుంది ... కథల్లో సాగతీతకు అవకాశం ఉండదు. కొత్త దర్శకులకు .. రచయితలకు .. నటీనటులకు అవకాశాలు పెరుగుతాయి. ఒక మంచి కంటెంట్ ను చూసిన ఫీల్ ఆడియన్స్ కి ఉంటుంది. ఈటీవీ విన్ తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమే.