మరికాసేపట్లో లోక్ సభ ముందుకు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు.. పాసయ్యేనా?
- బిల్లును వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి
- లోక్ సభలో ఎన్డీయే కూటమికి 282 మంది ఎంపీలు
- రాజ్యసభలో మిత్రపక్షాలతో కలిసి ఎన్డీయే సంఖ్యాబలం 125
లోక్‌సభలో..
వక్ఫ్ సవరణ బిల్లు లోక్ సభలో పాస్ కావాలంటే 272 మంది ఎంపీలు (సాధారణ మెజారిటీ) అనుకూలంగా ఓటేయాలి. లోక్ సభలో బీజేపీకి 240 మంది ఎంపీలు ఉండగా.. ఎన్డీయే కూటమిలోని పార్టీలు టీడీపీ (16), జేడీయూ(12), ఎల్జేపీ(రామ్ విలాస్) 5, ఆర్ఎల్‌డీ (2), శివసేన (షిండే) (7) లతో కలిపి మొత్తం 282 మంది ఎంపీలు ఉన్నారు. అంటే వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించడంలో సమస్య ఉండకపోవచ్చని తెలుస్తోంది.
రాజ్యసభలో..
లోక్ సభలో బిల్లుకు ఆమోదం లభించిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభ ఆమోదానికి 119 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో 98 మంది ఎంపీలు ఉండగా, మిత్ర పక్షాల సభ్యులను కలిపితే ఎన్డీయే సంఖ్యాబలం 125 మంది ఎంపీలుగా ఉంది. ఈ క్రమంలో రాజ్యసభలోనూ వక్ఫ్ సవరణ బిల్లు సునాయాసంగా పాస్ కానుంది.