మహాత్మాగాంధీ ముని మనవరాలి కన్నుమూత

    
మహాత్మా గాంధీ మునిమనవరాలు నీలమ్‌బెన్ పరీఖ్ కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ మనవరాలి కుమార్తె అయిన నీలమ్‌బెన్ నిన్న గుజరాత్‌లోని నవ్‌సిరిలో తుదిశ్వాస విడిచారు. నీలమ్‌బెన్ నవ్‌సిరిలో కుమారుడు డాక్టర్ సమీర్ పరీఖ్ వద్ద ఉంటున్నారు. 

ఈ ఉదయం 8 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. నీలమ్‌బెన్ మహాత్మాగాంధీ బాటలోనే నడిచారు. ఆమె తన జీవితాన్ని ‘వ్యారా’ (సేవ)కి అంకితం చేశారు. జీవితం మొత్తం మహిళా సంక్షేమం, మానవ సంక్షేమం కోసం పనిచేశారు.


More Telugu News