పోలీసు విచారణకు కాకాణి డుమ్మా... ఏం సమాచారం పంపించారంటే..!
- క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసు
- ఇప్పటికే రెండు సార్లు నోటీసులు పంపిన పోలీసులు
- గురువారం నుంచి అందుబాటులో ఉంటానన్న కాకాణి
నిన్న విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన రెండు సార్లు కాకాణి పోలీసులకు కనిపించకపోవడం గమనార్హం.
మరోవైపు ఈరోజు విచారణకు కూడా కాకాణి డుమ్మా కొట్టారు. అయితే, విచారణాధికారులకు సమాచారం పంపించారు. రేపు నెల్లూరులో కుటుంబ శుభకార్యం ఉందని... ఆ కార్యక్రమంలో పాల్గొంటానని కాకాణి తెలిపారు. ఎల్లుండి (గురువారం) నుంచి తాను అందుబాటులో ఉంటానని పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో, కాకాణికి మరోసారి నోటీసులు అందించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.