జూన్ వరకు ఎండలే ఎండలు!
- ఈసారి వేసవిలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
- వడగాలులు కూడా ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం
- నిన్న ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- నేటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, యూపీ, హర్యానా, బీహార్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వడగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెలలో దేశంలోనే పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు.
ఇక, వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. నేడు, రేపు, ఎల్లుండి చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. కాగా, నిన్న ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 2.4 డిగ్రీలు అధికం.